గ్రామపంచాయితీలకు గుడ్ న్యూస్ .. ఇకపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్‌..

Update: 2019-06-15 15:46 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామా పంచాయుతీలకు గుడ్ న్యూస్ అందించింది .. కొట్టగా ఎన్నికైన పాలక వర్గానికి చెక్ పవర్‌ను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాలక వర్గం వచ్చాక మూడు నెలల తర్వాత చెక్ పవర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది .. గతంలో చెక్ పవర్ అనేది సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకే మాత్రమే ఉండేది. కానీ ఇక నుంచి సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 17 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని చెక్‌ పవర్‌కు సంబంధించి సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ సంయుక్తంగా చెక్ పవర్ లభించనుంది. నిధులను సమర్థంగా వినియోగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News