జనవరి 17 నుంచి అసెంబ్లీ

జనవరి 17నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 17న ఉదయం 11:30కి కొలువుదీరనున్న సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

Update: 2019-01-05 13:19 GMT

జనవరి 17నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 17న ఉదయం 11:30కి కొలువుదీరనున్న సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. 18న స్పీకర్‌ ఎన్నిక జరగనుండగా, 19న సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. చివరిగా 20న గవర్నర్‌ ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పనున్న సభ అదే రోజు ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపనుంది.

తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం, ఏకాదశి శుభ తిదినాడు జనవరి 17న ఉదయం 11:30కి తెలంగాణ రెండో శాసనసభ కొలువు దీరనుంది. జనవరి 17నుంచి 20వరకు మొత్తం నాలుగు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన సమావేశంకానున్న శాసనసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌ ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన, నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. మర్నాడు అంటే జనవరి 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్‌ అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.18న బీఏసీ సమావేశం నిర్వహించనున్న స్పీకర్ గవర్నర్‌ ప్రసంగంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 19న అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పనున్న సభ, అదే రోజు ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపనుంది.

అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు అంటే జనవరి 16న ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేయడంతో ఆయనతో గవర్నర్‌ నర్సింహన్ ప్రమాణం చేయించనున్నారు. వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికకైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

Similar News