పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్...

Update: 2019-03-14 10:23 GMT

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. కొవ్వూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు తమ పదవులుకు రాజీనామా చేశారు. అలాగే, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల టీడీపీ అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా తమ రాజీనామాలను పంపించారు. మంత్రి జవహర్‌కి కొవ్వూరు సీటు ఇవ్వాలని స్థానిక నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. 

Similar News