బీజేపీలో చేరిన సీనియర్‌ నటుడు..

Update: 2019-04-23 09:06 GMT

బాలీవుడ్ సీనియర్ హీరో, పలు దేశభక్తి సినిమాలతో ఉత్తరాదిలో పాపులర్ అయిన సన్నీడియోల్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియుష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సన్నీడియోల్ ఎన్నికల బరిలో దిగే చాన్స్ ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. లేకపోతే గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ సదర్భంగా సన్నీడియోల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని తన తండ్రి సపోర్ట్ చేసిన విధంగానే నరేంద్రమోడీకి తాను మద్దతు తెలపనున్నట్లు పేర్కొన్నారు. చేతల ద్వారానే రాజకీయాల్లో తానెంటో నిరూపించుకుంటానని చెప్పారు.




 


Similar News