నిప్పుల కొలిమి..!

Update: 2019-05-11 01:11 GMT

భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 నుంచి 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇరురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.

రాత్రి వరకు వేడి సెగలు కక్కుతోంది. ప్రచండంగా కాస్తున్న ఎండకు వడగాడ్పులు తోడయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తెకు ముందే రోళ్లు పగిలేలా నిప్పులు కురిపిస్తున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే తీవ్రతతో రోడ్లన్నీనిర్మానుష‌్యంగా మారుతున్నాయి. రాత్రిళ్లు కూడా వాతావరణం వేడిగా ఉండటంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.

తెలంగాణలో ఆల్‌టైమ్‌ రికార్డు ఉష్ణోగ్రతలు 1973లో నమోదయ్యాయి. ఆ ఏడాది మే 9న భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో 46.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది 47 నుంచి 48 డిగ్రీలు దాటిపోతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.   

Similar News