విజయవాడకు కోడికత్తి కేసు నిందితుడు

వైసీపీ అధినేత జగన్ హత్యా యత్నం కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు.

Update: 2019-01-11 04:15 GMT

వైసీపీ అధినేత జగన్ హత్యా యత్నం కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. ఇవాళ నిందితుడ్ని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. నిందితుడ్ని తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. జగన్‌పై దాడి కేసు పత్రాలను ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ ఏడో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ కోర్టును అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు పంపించారు. దీంతో కోటి కత్తి దాడి కేసు ఇక విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో విచారణ జరుగనుంది.

Similar News