శ్రీరెడ్డి సక్సెస్.. స్పందించిన తెలంగాణ సర్కార్..

Update: 2019-04-17 14:16 GMT

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని శ్రీరెడ్డి కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. జీవో నంబర్ 984 ప్రకారం సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీరెడ్డి, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసతి, గాంధీ మెడికల్ కాలేజీ డాక్టర్ రమాదేవి, సామాజిక కార్యకర్త, విజయలక్ష్మీలతో కమిటీ నియమించారు.

కమిటీ చైర్మన్ గా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామోహన్ రావు వ్యవహరించనున్నారు. సభ్యులుగా దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ,సుధాకర్ రెడ్డి కొనసాగనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు ఎవరైనా వేధిస్తే కమిటికి నిర్భయంగా చెప్పవచ్చని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది. ఇండస్ట్రీలో జరిగే చీకటి బాగోతాలను బయటపెట్టి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని పడకసుఖం కోరుకునే వారిని గుట్టును బయటపెట్టడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్నాళ్లగానో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నప్పటికీ శ్రీరెడ్డి నిరసన ద్వారా ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Similar News