కోటప్ప సన్నిధిలో కోడెల..

ఆయన అసెంబ్లీలో పార్టీల తగవు తీర్చే పెద్దమనిషి . క్లాస్ రూమ్ ను కంట్రోల్ చేసే టీచర్ లా కనిపిస్తారు. అధికార, విపక్షాలను అదుపు చేస్తూ అసెంబ్లీలో అనువైన వాతావరణాన్ని కల్పిస్తారు ఆయనే స్పీకర్ కోడెల.

Update: 2019-01-20 03:31 GMT

ఆయన అసెంబ్లీలో పార్టీల తగవు తీర్చే పెద్దమనిషి . క్లాస్ రూమ్ ను కంట్రోల్ చేసే టీచర్ లా కనిపిస్తారు. అధికార, విపక్షాలను అదుపు చేస్తూ అసెంబ్లీలో అనువైన వాతావరణాన్ని కల్పిస్తారు ఆయనే స్పీకర్ కోడెల. కానీ సభ బయటకొస్తే మాత్రం చాలా సరదా మనిషి గుంటూరు జిల్లా కోటప్ప కొండ హిల్ ఫెస్టివల్ ఆయనలో రెండో కోణాన్ని పరిచయం చేసింది.

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సీనియర్ రాజకీయ వేత్తగానే మనకు తెలుసు. చూసేందుకు చాలా సీరియస్ మనిషిలా కనిపిస్తారు. కానీ ఆయనలో మరో సరదా మనిషీ ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగో ఇలా గ్రామీణ కళాకారులతో ఆడి పాడారు. తలపై కొమ్ము పాగా ధరించి వారితో కలిసి చిందులేశారు. పులిరాజాలు కవ్వించి కవ్వించి దెబ్బలాడుకుంటుంటే సరదాగా చూశారు. ఇక గ్రామీణ క్రీడల ప్రారంభోత్సవంలో అయితే ఆయన చిన్న పిల్లాడే అయిపోయారు. కిందకి ఒంగి కూర్చుని నేర్పుగా గోళీలాడారు.అంతేనా? కర్రా బిళ్లా ఆడారు. తాడుతో బొంగరం వేశారు..ఇలా ఒకటీ రెండు కాదు. గ్రామీణ ఆటల పోటీలన్నింటిని లాంఛనంగా ఆడి ప్రారంభించారు.

గుంటూరు జిల్లాలో ని కోటప్ప కొండలో రెండు రోజుల పాటూ జరిగే ఈ ఫెస్టివల్ కోసం అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు కోడెల పర్యావరణ పరిరక్షణ, అడవులు, కొండల గొప్పతనం వివరించే ఈ ఉత్సవంలో లేపాక్షి హ్యాండీ క్రాఫ్టు, చేనేత వస్త్రాల బజార్లు ఏర్పాటు చేస్తున్నారు.. పారా మోటార్, పారా సైలింగ్, హాట్ ఎయిర్ బలూన్ రైడ్స్, హెలికాప్టర్ రైడింగ్, ఈ ఉత్సవంలో అదనపు ఆకర్షణ.

దీనికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు, రోజుకు 5 గంటల సేపు సినిమాల ప్రదర్శన, జబర్దస్త్ కళాకారుల స్టేజ్ షోలనూ ఏర్పాటు చేశారు. ఉత్సవానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఏపీలో సంక్రాంతి తర్వాత స్థానిక పండగల హడావుడి పెరగడంతో సందడి కనిపిస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈ పండగకు తరలి వస్తున్నారు.

Full View 

Similar News