అమెరికాలో మరోసారి కాల్పుల మోత..11 మంది మృతి

Update: 2019-06-01 03:53 GMT

అమెరికాలో మరోసారి గన్‌ పేలింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్‌ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రభుత్వ భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులకు పాల్పడింది కూడా ప్రభుత్వ ఉద్యోగే అని గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా అందులో ఒకరు పోలీసు అధికారి కూడా ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చారు. కాల్పులకు పాల్పడింది. ఒక్కడే అని అతను అదే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనకున్న కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Similar News