డ్యాన్స్‌ బార్లపై ఆంక్షల సడలింపు

మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై ఉన్న ఆంక్షలను సుప్రీం కోర్టు సడలించింది. హోటళ్లు, రెస్టారెంట్లలలో డ్యాన్స్‌లను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను కోర్టు తోసిపుచ్చింది.

Update: 2019-01-17 11:13 GMT

మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై ఉన్న ఆంక్షలను సుప్రీం కోర్టు సడలించింది. హోటళ్లు, రెస్టారెంట్లలలో డ్యాన్స్‌లను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను కోర్టు తోసిపుచ్చింది. డ్యాన్స్‌ బార్లకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు మహారాష్ర్ట ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పుబట్టింది. హోటళ్లు, రెస్టారెంట్‌లలో డిస్కోలు, ఆర్కెస్ట్రాలకు అనుమతించింది. డ్యాన్సర్లపై డబ్బు వెదజల‍్లడంపై కోర్టు నిషేధం విధించింది. డ్యాన్సు చేసేవారికి, బార్‌ ఓనర్‌లకు మధ్య తప్పకుండా కాంట్రాక్టు ఉండాలని ఆదేశించింది. రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే డ్యాన్స్‌ బార్లను తెరచి ఉంచాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. 

Similar News