నారావారిపల్లెకు.. నారా, నందమూరి కుటుంబాలు

సంక్రాంతి సంబరాలకు ఎక్కడెక్కడి నుంచో జనం సొంతూళ్ళకు కదులుతున్నట్లే ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం కూడా సొంతూరు నారావారి పల్లెకు బయలు దేరారు.

Update: 2019-01-12 12:52 GMT

సంక్రాంతి సంబరాలకు ఎక్కడెక్కడి నుంచో జనం సొంతూళ్ళకు కదులుతున్నట్లే ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం కూడా సొంతూరు నారావారి పల్లెకు బయలు దేరారు. నారా వారి కోడలు బ్రాష్మిణి కుటుంబ సభ్యలతో కలిసి నారావారి పల్లెకు చేరుకున్నారు. రేపటికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు నారావారి పల్లెకు చేరుకోనున్నారు. 14వ తేదీకి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ స్వగ్రామానికి చేరుకుంటారు. ప్రతియేటా సంక్రాంతి సంబరాలు సొంతూళ్ళో జరుపుకుంటున్న బాబు కుటుంబం ఈ యేడు కూడా సంక్రాంతి వేడుకలు సొంతూళ్ళోనే జరుపుకోనున్నారు. సంక్రాంతి పండగొచ్చిందంటే నారావారి పల్లెకు ప్రత్యేకత సంతరించుకుంటుంది. 

Similar News