రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కోసం కాదు -ఆర్. కృష్ణయ్య

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య తీవ్రంగా తప్పుబట్టారు.

Update: 2019-01-07 14:00 GMT

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారని కృష్ణయ్య దుయ్యబట్టారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కోసం కాదని రిజర్వేషన్లు కులవివక్ష, సామాజిక వివక్షను నిర్మూలించ డానికేనని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకోసం భారత ప్రధాని మోడీ మళ్లీ తమ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలనే ఈ నిర్ణయం తీసున్నారని కృష్ణయ్య అన్నారు. ప్రధాని మోడీ ఎన్ని జిమిక్కులు చేసిన ప్రజలు మాత్రం నమ్మె పరిస్థితిలో లేరని అన్నారు. 2019ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 

Similar News