చంద్రబాబుపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ల ఆగ్రహం

Update: 2019-04-13 14:03 GMT

నారా చంద్రబాబు నాయుడిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌లు లేఖ సంధించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను రిటైర్డ్‌ ఐఏఎస్‌లు తీవ్రంగా ఖండించారు. ఎల్వీ సుబ్రమణ్యం కోవర్టు అని, సహ నిందితుడంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వాడిన భాష, వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎల్వీ సుబ్రమణ్యాన్ని సహ నిందితుడని ఎలా సంబోధిస్తారని నిలదీశారు. సీఎస్‌ను కోవర్టని ఎలా అంటారు? ఇదేనా 40ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లే చేయకపోతే కోవర్టులేనా అంటూ మాజీ సీఎస్‌‌లు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లు నిప్పులు చెరిగారు. అలాగే ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు వెంటనే ఐఏఎస్‌లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Similar News