ఐర్లాండ్‌ను తిప్పేసిన రషీద్‌

Update: 2019-03-18 09:01 GMT

అఫ్గానిస్తాన్, ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైన టెస్టులో అఫ్గానిస్తాన్ విజయం దిశగా పరుగుపెడుతోంది. అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 22/1తో మూడో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఐర్లాండ్‌ 288 పరుగుల చేసి ఆలౌటైంది. కాగా బాల్‌బిర్నీ (82; 11 ఫోర్లు), ఓబ్రియాన్ (56; 7 ఫోర్లు) చేధించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో అఫ్గానిస్తాన్‌కు లభించిన ఆధిక్యంతో లక్ష్యం 147 పరుగులే అయితే ధీన్ని ఛేధించేందుకు బరిలో దిగింది ఆఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ పోయి కేవలం 29 పరుగులే చేసింది. ప్రస్తుతం ఎహ్‌సానుల్లా 16 బ్యాటింగ్‌, రహమత్‌షా 11 బ్యాటింగ్‌ క్రీజులో కొనసాగుతున్నారు. 

Similar News