జనసేనానిపై పాట రూపొందించిన రామ్‌చరణ్

Update: 2019-01-26 09:23 GMT

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ హీరో రామ్‌చరణ్ తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌పై ఒక పాట రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దేశం కోసం పాటుపడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కడొచ్చాడంటూ మొదలైన సాంగ్ జనసేనై కదిలాడంటూ సాగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Full View 

Similar News