ఏపీ ఎన్నికల్లో పవన్‌కు వచ్చే సీట్లు ఇన్నేనట..!

Update: 2019-04-17 10:27 GMT

ఏపీలోమొన్నటి వరకు ఓట్లపండుగతో హోరెత్తింది. గల్లీగల్లీలో మైకులతో నాయకులు, పార్టీ కార్యకర్తలు తెగ హడవిడి చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11తో ఎన్నికల సమరం సమాప్తం అయింది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం సైలెంట్ వాతావరణం కనిపిస్తున్నా అభ్యర్థులు పార్టీ నాయకుల మధ్య చర్చల పరంపర సాగుతోంది. ఇక కేవలం ఎన్నికల ఫలితాలపై అందరి కన్ను పడింది. కాగా ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో ఎన్నికల ఫలితాలు బెట్టింగ్ రాయుళ్లు కూడా ఫుల్ బీజీ అయిపోయారు. ఏపీలో ఎవరి జెండా రేపరేపలాడుతుందోనని జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. ఇక ఆయా నియోజకవర్గాలలో పోటీకి దిగినా ప్రధాన నాయకులపై హోరాహోరిగా బెట్టింగ్ రాయుళ్లు పోటీపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్యపోటీ రసవత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలు తమకు వచ్చే సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అధికార పార్టీ టీడీపీకి మాత్రం తప్పకుండా 150కి పైగా సీట్లతో అధికార పగ్గాలు చేపట్టనుందని ఇటు 145సీట్లతో తమ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని వైసీపీ ధీమాతో ఉంది. ఇద్దరితో ఎన్నికల రణరంగంలో సమానంగా పోటీపడ్డ జనసేన పోలింగ్ తరువాత మాత్రం జడపత్త లేదు. ఇప్పటికే ఓట్లపోలింగ్ ముగిసిన నాటి నుండి నేటి వరకు ఇటు అధికార పార్టీ టీడీపీ, వైసీపీ ప్రెస్ మీట్స్ పెట్టి నానా హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో పవన్ కేడర్ లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీపీఎం - బీఎస్పీలతో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. అయితే పవన్ కేవలం ఉత్తరాంధ్ర ఓటర్లపై ఆధారపడిందని చెప్పవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చేయించిన సర్వే ద్వారా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 25 నుంచి 30 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విశ్లేషకులు మాత్రం పవన్ పార్టీ సింగిల్ డిజిట్ దాటడమే కష్టతరమని అంటున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తారో.  

Similar News