టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై..!

Update: 2019-03-23 08:52 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. కాగా ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీకి భారీ షాక్ తగిలింది. పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పిఠాపురంలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీసీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సభలో వైసీపీ తీర్థంపుచ్చుకోనున్నట్లు నారాయణమూర్తి అనుచరగణం వెల్లడించింది. అయితే పి.గన్నవరం టికెట్‌ను ఈసారి నేలపూడి స్టాలిన్‌కు కేటాయించడంతో నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు పులపర్తి నారాయణమూర్తి బుజ్జగించే యత్నం చేశారు. వచ్చేరోజుల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఇప్పిస్తామని నచ్చజెప్పారు. కాగా ఇదే విషయాన్ని శనివారం కాకినాడకి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా హామీ ఇప్పిస్తామని హామీ ఇచ్చినా పులపర్తి నారాయణమూర్తి తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది.

Similar News