ప్రధాని గైర్హాజరుపై విపక్షాల ఫైర్‌

Update: 2019-02-27 16:07 GMT

భారత సైన్యం వీరోచిత పోరాటానికి ఎన్డీయేతర పక్షాలు సంఘీభావం తెలిపాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశం పుల్వామా ఘటనను ఖండిస్తూ తీర్మానం చేసింది. పాక్‌ను బెంబేలెత్తిస్తున్న భారత సైన్యం పరాక్రమాన్ని ప్రశంసించింది. అయితే పైలట్ అభినందన్ అదృశ్యం కావడంపై ఎన్డీయేతర పక్షాల సమావేశంలో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత కోసం ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్‌కు సంఘీభావం తెలిపారు. అమరవీరుల త్యాగాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు. ఇదే సమయంలో అఖిలపక్ష సమావేశానికి అందరినీ ఆహ్వానించకపోవడంపై సమావేశంలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, శరద్‌ పవార్‌, ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Similar News