నిజామాబాద్ ‌రైతు అభ్యర్ధుల పిటిషన్‌పై విచారణ వాయిదా ..

Update: 2019-04-04 12:59 GMT

నిజామాబాద్ పార్లమెంట్‌ ఎన్నికను వాయిదా వేయాలంటూ రైతు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తాము స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో ఉన్నా ఇంత వరకు గుర్తులు కేటాయించలేదని దీని వల్ల తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామంటూ రైతు అభ్యర్ధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తగిన సమయం లేకపోవడం వల్ల తమ విజయంపై ప్రభావం పడుతుందని వాదనలు వినిపించారు. ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి రైతు అభ్యర్ధుల తరపున ఉమ్మడిగా వాదనలు వినిపించారు. ఎన్నికల నిబంధనల -1961 ప్రకారం ప్రతి స్వతంత్ర అభ్యర్ధికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన 48 గంటల్లో గుర్తులు కేటాయించాల్సి ఉందన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయస్ధానం రైతులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తమకు అందజేయాలంటూ కోరారు. దీంతో తమకు సమయం కావాలంటూ కోరారు. కోర్టు ముగిసే సమయానికి పత్రాలు రాకపోవడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.   

Similar News