కృష్ణానదిలో మునిగిన బల్లకట్టు

Update: 2019-02-05 10:14 GMT

కృష్ణానదిలో స్పల్ప ప్రమాదం జరిగింది. ప్రయాణ సమయంలో బల్లకట్టు నదిలో మునిగింది. ఒడ్డు దగ్గర్లో ప్రమాదం జరగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బల్లకట్టుపై 20 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. చందర్లపాడు గుడిమెట్ల దగ్గర ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బల్లకట్టు మునిగిన సమయంలో ఒక లారీ, రెండు టాటా ఏస్ వాహనాలు, పశువులు, 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఓవర్ లోడ్‌తో ఉన్న లారీ ఎక్కించడం వల్ల బల్లకట్టు మునిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రామన్నపేట నుంచి బయలుదేరిన బల్లకట్టు అచ్చం పేటకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నీటిలో మునిగిన ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

Similar News