కోడికత్తి కేసులో ఏపీ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ

జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్ఐఏ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

Update: 2019-01-21 10:02 GMT

జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్ఐఏ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే దర్యాప్తు ఫైళ్లను కోర్టు ముందు ఉంచాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ పై దాడి కేసులో ఏపీ సిట్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారని, కేసు విచారణ దాదాపుగా పూర్తి చేశారనీ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇలాంటి సమయంలో ఎన్ఐఏకు కేసును అప్పగించడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.  

Similar News