ఇకపై 28 రాష్ట్రాలతో భారత్..!

Update: 2019-08-05 06:33 GMT

 కేంద్రసర్కార్ తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ముఖచిత్రం పూర్తి మారింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదించారు. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ముకశ్మీర్‌ అవతరించనున్నాయి. లద్దాఖ్‌ ప్రాంతాన్ని అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీంతో ఇప్పటి వరకు 29 రాష్ట్రాలను కలిగియున్న భారత్ ఇక నుండి 28 రాష్ట్రాలనే కలిగి యుండనుంది. అయితే గత 2014కు ముందు కుడా 28 రాష్ట్రాలు ఉండగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో 29కి చేరింది.

అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లదాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీని ప్రకారం జమ్మూకశ్మీర్‌లోనూ భారత రాజ్యాంగమే అమలు కానుంది. కేంద్రసర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొందమంది సర్వత్రహర్షం వక్తం చేస్తుండాగా.. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.కాగా రాజ్యాంగ ప్రతులను చించివేసిన పీడీపీ సభ్యుల తీరును గులాం నబీ ఆజాద్‌ తీవ్రంగా తప్పుపట్టారు. చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన చేపట్టిన పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపాలని ఛైర్మన్‌ మార్షల్స్‌ను ఆదేశించారు. ఇక మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దును నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశాయి.

అమిత్‌ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయింది. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్‌ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్‌ 35ఏ, 370 అధికరణలను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్‌ షా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది.

Tags:    

Similar News