ఏపీ వ్యవహారాల్లో తెలంగాణ పోలీసుల జోక్యం ఎందుకు?

Update: 2019-03-05 05:22 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ పోలీసుల జోక్యం తమ హక్కులను కాలరాయడమేనని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంతో వైసీపీ క్రిమినల్‌ మైండ్‌ బయటపడిందన్నారు. ఏపీ ప్రజలు ఓటేస్తే హైదరాబాద్‌లో ఉండి కేటీఆర్‌తో కలిసి పాలిస్తారా అంటూ మంత్రి సోమిరెడ్డి పరోక్షంగా వైసీపీని ప్రశ్నించారు.

డేటా పేరుతో టీడీపీకి సేలందిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థపై తెలంగాణ పోలీసుల కేసు నమోదు, విచారణ నేపథ్యంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైకాపా, తెరాస, భాజపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైకాపా నాయకులకు తెలంగాణ పోలీసులపైనే ఎందుకు నమ్మకముందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఓటేస్తే హైదరాబాద్‌లో ఉండి కేటీఆర్‌తో కలిసి పాలిస్తారా అంటూ పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంతో వైకాపా క్రిమినల్‌ మైండ్‌ బయటపడిందన్నారు. ఆ పార్టీ చరిత్రంతా నేరపూరితమైనదేనన్నారు. తెదేపా కార్యకర్తలకు చేసిన సహాయం మాత్రమే సేవామిత్ర యాప్‌లో పొందుపరిచినట్లు సోమిరెడ్డి వివరించారు. పార్టీకి సంబంధించిన పనిని మాత్రమే ఆ ఐటీ సంస్థకు అప్పగించామన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తుల విషయంలో 33 మందిపై కేసులు నమోదయ్యాయని సోమిరెడ్డి చెప్పారు.

Similar News