టీడీపీ ఎంపీగా లగడపాటి పోటీ... ఆ సీటుపై కన్ను ?

Update: 2019-03-10 07:41 GMT

రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని శపథం చేసిన ఆంధ్రఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నట్టుగానే మొత్తానికి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కానీ ప్రజల నాడిని ఒడిసి పట్టుకునే విధంగా సర్వేలు చేయించడం మాత్రం లగడపాటి మానుకోలేదు. ఎప్పటికప్పుడు ఏ రాజకీయానేతలు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో అక్కడి అభ్యర్థి జతకం చెప్పడం మాన అక్టోపస్ స్టైల్. అయితే తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రసవత్తర పోరులో లగపాటి తన జోస్యం చెప్పారు. దింతో ఒక్కసారిగా హీట్ ఎక్కిన విషయం తెలిసిందే అయితే జాతీయ మీడియా ఛానెళ్లు మాత్రం కేసీఆర్ కారే గెలుస్తుందని చెబితే లేదు లేదు మహాకూటమినే ప్రజలు నెత్తిన బెట్టుంటారు అని లగపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే చివరికి కారు స్పీడ్ ముందు లగడపాటి తుస్సుమన్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుతో అప్పుప్పుడు సమావేశమవుతున్న ఈ ఆంధ్రా అక్టోపస్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని అనేక సార్లు తెలిపారు. గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి ఈ సారి టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నరసరావుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుతో లగడపాటి ఏకాంతంగా చర్చలు జరపడం వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఇదేననే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నరసరావుపేట ఎంపీగా ఎలాగైనా తానే పోటీ చేస్తానని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పుకొస్తున్నారు. ఇక్కడి నుంచి కోడెలను ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా చాలాకాలంగా సాగుతోంది. మరి వీరిని కాదని లగడపాటి నరసరావుపేట ఎంపీ సీటును దక్కించుకుంటారా ? అన్నది కూడా ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆసక్తికరంగా మారింది. 

Similar News