యువకుడి చెంప చెళ్లుమనిపించిన కుష్బూ

Update: 2019-04-11 13:48 GMT

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. తనతో అభ్యంతకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి చెంప చెళ్లుమనిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్- జేడీఎస్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తన వాహనం వైపు నడుస్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి ఖుష్బూ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇక దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉగిపోయిన కుష్బూ వెంటనే వెనక్కి తిరిగి చెంప చెళ్లుమనిపించారుచెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనను గమనించిన పోలీసులు, పార్టీ కార్యకర్తలు వెంటనే ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. కాగా దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై రిజ్వాన్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, వెంటనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Similar News