నాకే ఇలాజరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?: కోడెల

Update: 2019-04-11 09:22 GMT

సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన తనపై వైసీపీ పార్టీ నేతలు దాడికి చేశారని అన్నారు. దాడిని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారని ముందుగానే ఊహించానన్నారు. అసలు ఈ విధంగా దాడులు చేయటం అనేది ఇన్నేళ్లలో మొట్టమొదటిసారి చూస్తునట్లు కోడెల శివప్రసాదరావు పెర్కోన్నారు. అసలు సభాపతిగా ఉన్న తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని కోడెల ప్రశ్నించారు. అసలు ఈ ఎన్నికల్లో ఈవీఎంలే వద్దని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి చెబుతున్నాని ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు గుర్తు చేశారు. ఇక స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఏపీలో 30 శాతం నమోదైంది.

Similar News