ప్రియమైన మీకు..

ఓట్ల గల్లంతు, బోగస్ ఓట్ల వివాదాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డిసెంబరు 26న ప్రారంభమైంది.

Update: 2019-01-10 01:13 GMT
Rajat Kumar

ఓట్ల గల్లంతు, బోగస్ ఓట్ల వివాదాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డిసెంబరు 26న ప్రారంభమైంది. జనవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా సవరణ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ రాష్ట్రంలో చేయ‌ని వినూత్న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఓట‌రు కి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం కోస‌మే ఓటరుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ లేఖలు రాయనున్నారు. ఆ లేఖతోపాటు రిప్లై పోస్టు కార్డునూ జత చేస్తున్నారు. ఓటర్ల నమోదులో ఇబ్బందులను ఆ లేఖ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యుత్తర కార్డును ఉపయోగించవచ్చు. లేఖ అందినట్లుగా దానితో జ‌త ప‌ర్చిన కార్డు పై ఎక‌నాలెడ్జ్ మెంట్ రాసి పంపాలి. ఇందులో ఓట‌రుకు కొత్త ఓట‌రా లేక నియోజ‌క‌వ‌ర్గం మారారా అడ్ర‌స్ మారిందా ఇలా స‌మ‌స్య‌ను బ‌ట్టి స్పందించ‌నున్న‌ది ఈసి. ఇందుకు 50 లక్షల రూపాయలను ఖర్చు చేయనుంది. మ‌రో వైపు ఇటువంటి కొత్త ప్ర‌య‌త్నానికి రాజ‌కీయ పార్టీలు సైతం స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు ఈసి. దీనికోసం రాజ‌కీయ పార్టీలకి కూడా లేఖ‌లు రాయనున్నారు.  

Similar News