అల్లు అర్జున్‌కు జనసేన అభ్యర్థి కౌంటర్!

Update: 2019-04-07 10:33 GMT

మరో మూడురోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మేరకు జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబుకు మద్దతుగా పోస్టు పెట్టాడు. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా శిల్పా రవికి మద్దతు పలుకుతూ శిల్పా రవిని గెలిపించాలంటూ అల్లు అర్జున్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా ఇప్పడు ఈ మ్యాటర్ చర్చనీయాంశం అయ్యింది.

ఇది నంద్యాల్లో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థికి ఇబ్బందికరమైన అంశంగా మారింది. నంద్యాల నుంచి జనసేన తరఫున ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పోస్టు మీద శ్రీధర్ రెడ్డి స్పందించాడు. కాగా నంద్యాల నియోజకవర్గంలో సిని నటుడు అల్లు అర్జున్ ప్రభావం ఏముంటుందని? అసలు అల్లుఅర్జున్ ఏమైనా ఆ నియోజకవర్గం ఓటర్ కాదు ఆ ప్రాంతం వ్యక్తి కాదని అలాంటి వారి ప్రభావం ఏమీ ఉండదన్నట్టుగా శ్రీధర్ రెడ్డి స్పందించారు. శిల్పా రవికి అల్లుఅర్జున్ మద్దతు పలకడం వెనుక వేరే కథ ఉందని అల్లు అర్జున్ భార్య శిల్పా రవి భార్యలు కలిసి పార్టీలకు వెళ్తారని అలా వారి మధ్య మంచి స్నేహం ఉందని ఆ స్నేహంతోనే ఇప్పుడు అల్లు సోషల్ మీడియా ద్వారా శిల్పా రవికి మద్దతు పలికారని శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

Similar News