పవన్ రెండు చోట్ల గెలిచే ఛాన్స్.. భారీగా బెట్టింగ్స్

Update: 2019-05-01 03:33 GMT

ఏపీ ఎన్నికలు ముగిసి 20రోజులు గడిచిపోయింది. సార్వత్రిక యుద్ధంలో విజేతలు ఏవరనేదానికి కూడా మరో 23రోజుల సమయం మిగిలి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు సర్వేలు తెప్పించుకొని తెగ సంబురపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు వరకు ముఖ్యంగా ఏపీలో త్రిముఖ పోరు ఉంటుంది అది కూడా టీడీపీ - వైసీపీ - జనసేన మధ్యననే అందరూ ఊహించారు. కాగా ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ట్రెండ్ కాస్తా వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఉంది. దీంతో దీంతో జనసైనికులు కొంత నిరుత్సాహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ఖర్చు పెట్టి మరీ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుకొని, పందెం బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలు సమరం ముగియగానే హడావిడిగా కళ్లుముసుకొని వైసీపీ మీదనే భారీగా పందెం కాసిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభావం తప్పక ఉందని గత 20 రోజుల పాటు వెలువడుతున్న వివిధ రిపోర్టులను బట్టి బెట్టింగ్ బాబులు ఒక అంచనాకు వస్తున్నారు. పోటీ కోస్తాలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో జనసేన పార్టీ మంచీపోటీ ఇచ్చిందని భావిస్తున్నారు. మొత్తానికి అధికార టీడీపీ, వైసీపీలకు ధీటుగా పోటీ ఇచ్చిందని భావిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రణరంగంలో దిగి భీమవరం - గాజువాక స్థానాల్లో పోటీ చేసిన రెండు సీట్లలోనూ విజయకేతనం ఎగురవేస్తారని జోరుగా పందేలు కాస్తున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత జనసేన వర్గాల్లో చాలామంది మొదట పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో గెలవడం కష్టమేనని అభిప్రాయానికి వచ్చారు. తరువాత ఏదో ఒక స్థానంలోనే గెలుస్తారని భావించారు. ఇక తాజాగా బూత్ స్థాయి వారీగా వస్తున్న సమాచారంతో లెక్కలు వేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాన్ పోటీచేసిన రెండు సీట్లలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనాకు వచ్చాయి. అసలు విషయం బయటపడాలంటే మాత్రం మరో 23 రోజులు ఆగాల్సిందే. 

Similar News