నేడు అమరావతికి జగన్..

Update: 2019-05-22 02:36 GMT

ఎన్నికలు అయిన దగ్గర నుంచి తమ పార్టీ కచ్చితంగా గెలవబోతోందని ఘంటాపథంగా చెబుతూ వచ్చిన జగన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మరింత ఖుషీగా ఉన్నారు. ఇపుడు మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఈ సందర్భంగా ఫలితాలను విశ్లేషించేందుకు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు. అందుకోసం ఆయన ఈరోజు అమరావతి బయలుదేరుతున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు అందరినీ ఎటువంటి పరిస్థితిలోనూ అందుబాటులో ఉండాల్సిందిగా ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీచేసింది. ఎక్కడికక్కడ అప్రమత్తతతో ఉండాలని అందరికీ సూచించింది. ఎగ్జిట్ ఫలితాలతో తాము ఓడిపోతామన్న విషయాన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం పార్టీ లెక్కింపు సమయంలో గందరగోళం సృష్టించవచ్చని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే అప్రమత్తంగా ఉండాలని తమ కార్యకర్తలకు, నాయకులకు, అభ్యర్థులకు చెబుతోంది. ఇక కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే తమ నాయకుడు జగన్ ఫలితాల సరళిని పరిశీలిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సందర్భంగా కేంద్రంలో ఎ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అంశంపై చర్చించాలని భావిస్తున్నారు. ముందే చెప్పినట్టుగా ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ ఏదైనా తమ మద్దతును ఇవ్వాలని అనుకున్తున్నారట. ఈ విషయాన్ని చర్చించడానికి పార్టీ నేతలందరూ అమరావతి కార్యాలయంలో అందుబాటులో ఉండాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద జగన్ తన విజయం ఖాయమనే నమ్మకంతో అన్ని ఏర్పాట్లూ వేగంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Similar News