ఈవీఎంలు రిగ్గింగ్‌ చేసినా నా గెలుపు ఖాయం..

Update: 2019-04-09 15:07 GMT

సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచార ఘట్టం ముగిసింది. నెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఎలక్షన్ క్యాంపైనింగ్‌ ఈ సాయంత్రం 6గంటలకు క్లోజైంది. దాంతో ఇన్ని రోజులూ హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఈనేపథ్యంలో ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను 3లక్షల మెజార్టీతో గెలుస్తానని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు కావాలని చేవెళ్ల ప్రజలు కోరుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఈవీఎంలు రిగ్గింగ్‌ చేసినా తన గెలుపు ఖాయమని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 400కి పైగా గ్రామాలు తిరిగానని, ఆరులక్షల మందిని కలిశానని, మూడు లక్షల హైఫైలు ఇచ్చానని, ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.  

Similar News