అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ : గవర్నర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు.

Update: 2019-01-19 15:27 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా ఉందన్నారు గవర్నర్ నరసింహన్. మిషన్‌ కాకతీయ సత్ఫలితాలిచ్చిందని తెలిపారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పారదర్శక విధానాలు అమలవుతు న్నాయన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామన్నారు. రైతుబంధు పథకాన్ని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారని గవర్నర్ తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. 

Similar News