అరసవెల్లిలో ఆదిత్యుని తాకిన కిరణాలు

Update: 2019-03-10 06:14 GMT

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య భగవానున్ని లేలేత కిరణాలు మూల విరాట్ పాదాలను తాకాయి. ఈ అద్బుత ఘట్టాన్ని చూసేటందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభాత కిరణాలు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూర్య కిరణాలు ముందుగా స్వామి పాదాలను స్పృశించి శిరస్సు వరకు చేరుకోవడంతో దీన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగి తేలారు.

సూర్యుడు ఉత్తర, దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి రెండు సార్లు అద్భుత దృశ్యం దర్శన మిస్తుంది. ఏటా మార్చి 9,10 తేదీల్లో అదేవిధంగా అక్టోబర్‌ 1,2 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయి. సూర్యకిరణాలు ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకే దృశ్యన్ని చూడటానికి భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తారు. తొలి రోజైన శనివారం వాతావరణం అనుకూలించకపోవడంతో స్వామి ఆలయంలోని మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు ఒకింత నిరాశ చెందారు. అయితే రెండో రోజు ఆదిత్యుని భానుడు స్పృశించాడు. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వసిస్తారు.  

Similar News