బనగానపల్లి తహశీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా బనగానపల్లి తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా డిప్యూటీ తాహశీల్దార్ గదిలో పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన వాచ్‌మెన్ స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Update: 2019-01-23 05:44 GMT

కర్నూలు జిల్లా బనగానపల్లి తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా డిప్యూటీ తాహశీల్దార్ గదిలో పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన వాచ్‌మెన్ స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరు కంప్యూటర్లు, ప్రింటర్స్ , గ్రామాలకు చెందిన రికార్డులు కాలిపోయాయి. సుమారు పదిలక్షల విలువైన ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. భూ అక్రమార్కుల బండారం బయటపడుతుందోనని అగ్ని ప్రమాదం ఘటన సృష్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Similar News