ఏపీలో మొదలైన నామినేషన్ల పర్వం...

Update: 2019-03-19 13:37 GMT

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీష, కడప జిల్లా పులివెందుల టీడీపీ అభ్యర్ధి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్ధి నేలపూడి స్టాలిన్ బాబు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు వారి వారి నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యాకర్తలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలో ఈ ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెడుతాయాని ధీమా వ్యక్తం చేశారు.  

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. 16 నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 21 యధావిధిగా నామినేషన్ల స్వీకరణ ఉంటుందని 23, 24 తేదీల్లో సెలవు దినాలు కావడంతో ఆ రెండు రోజులు నామిషన్లు స్వీకరణ ఉండదని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో ఒక లక్షా 55 వేల 99 ఓట్లు తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఏపీ డీజీపీని మార్చాలంటూ ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అధికారులు ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.

Similar News