వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీ

Update: 2019-03-31 03:20 GMT

ఏపీలో ఎన్నికలు చూస్తుంటే మహాయుద్ధన్నే తలపిస్తోంది. ఇటు అధికార, ప్రతిపక్షపార్టీనేతలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నా వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి ఉద్రిక్తత రేగింది. పనపాకం హరిజనవాడలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలోఇరు పార్టీలకార్యకర్తలు గాయపడ్డారు. పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ఇరు పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదు చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. 

అయితే ప్రసుత్తం చంద్రగిరి ఎమ్మెల్యేగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా అరుణపై విజయం సాధించారు. వరుసగా 1999, 2004,2009 ఎన్నికల్లో విజయం సాధించిన గల్లా అరుణను ఓడించి చెవిరెడ్డి చంద్రగిరిలో విజయంసాధించారు. అయితే అప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు రగులుతూనే ఉన్నాయి కాగా ఏపీలో ఎన్నికల వేళ మరింత ముదిరాయి. పోలింగ్ కు సమయం ముంచుకొస్తున్న వేళ చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Similar News