పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ..

Update: 2019-05-25 09:25 GMT

సార్వత్రిక ఎనికల్లో దేశం మొత్తాన్ని ఆకర్షించింది నిజామాబాద్. పసుపు బోర్డుతో పాటు.. రైతుల సమస్యల్ని తీర్చే విషయంలో ఎంపీ కవిత విఫలం కావటంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఏకంగా 185 మంది అభ్యర్థులుగా బరిలోకి దిగారు .. దీంతో ఈ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిలో పడేలా చేసింది. తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కవితకు బుద్ధి చెప్పే పనిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ కు మద్దతు ఇవ్వటంతో ఆయన కవిత పై అరవై వెయిల ఓట్ల తేడాతో గెలిచారు ..

ఈ విజయం అనంతరం పసుపురైతుల సమస్యల్ని తాను పరిష్కరిస్తానని చెప్పిన అరవింద్ వారికి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఒకవేళ తాను కానీ పసుపురైతుల సమస్యల్ని తీర్చకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన మాటిస్తూ బాండ్ పేపర్ రాసివ్వటం విశేషం. పసుపు రైతులు పుణ్యమా అని రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలవటంతో ఎన్నికల సంఘం భారీ ఈవీఎంలను ఈ ఎన్నిక కోసం వినియోగించింది.  




 


Similar News