రానున్న3 రోజుల్లో తెలంగాణలో తీవ్ర ఎండలు

Update: 2019-05-16 00:35 GMT

వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమనబోతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. భయంకరమైన వడగాడ్పులు వీచనున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాలు అగ్ని గుండాన్ని తలపించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వచ్చే వారం సూర్య ప్రతాపం మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అంచానా వేసింది. ఈ నెల 19 నుంచి 23వ తేది వరకు భానుడు భగ్గుమనబోతున్నాడు.

రాబోయే వారంలో తెలంగాణతో పాటు ఏపీలోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు ఆర్టీజీఎస్ వెల్లడించింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు భారీ వడగాల్పులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ సారి జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తాకుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఒకవైపు ఎండల మండిపోతుండగా కొన్ని చోట్ల అకాల వర్షాలు కురిశాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. బల్మార్ లోని ఓ పొలంలో పిడుగు పడి రెండు ఆవులు మృతి చెందాయి. అప్పాయిపల్లి గ్రామంలో పిడుగు పాటుకు ఓ రైతు చనిపోయాడు. 

Full View

Similar News