సుజనా చౌదరికి భారీ షాక్‌

Update: 2019-04-02 15:39 GMT

ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను జప్తు చేసింది. దీనిపై గతంలో సీబీఐ విచారణ జరిపింది. ఆ విచారణను ఈడీకి బదిలీ చేసింది. మనీ ల్యాండరింగ్‌ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ.364 కోట్ల కుచ్చుటోపీ. భారీ ఎత్తున షెల్‌ కంపెనీలను సుజనా సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా ఆఫీస్‌ నుంచి అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. షెల్‌ కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 

Similar News