28 నుంచి ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ: రజత్‌కుమార్

Update: 2019-03-17 04:13 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తునట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ నెల 22న అనుబంధ జాబితా ప్రకటిస్తామని.. ఈ నెల 28 నుంచి ఫోటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 98 ఉన్నాయని ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. కొత్తగా ఓటుహక్కు వచ్చినవారికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మిగతావారు మీ సేవలో 25 చెల్లించి ఓటురు గుర్తింపు కార్డు పొందవచ్చన్నారు.

ఇక ఇప్పటివరకూ తనిఖీల్లో దాదాపు 3 కోట్ల వరకు నగదు పట్టుబడినట్లు తెలిపారు. 4వేల770 లీటర్ల మద్యం, రాచకొండ పరిధిలో కోటి విలువచేసే హెరాయిన్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రగతిభవన్‌లో రాజకీయ భేటీలన్న కాంగ్రెస్ ఫిర్యాదును సీఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.ఇక నా ఓటు యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగించనున్నట్లు వెల్లడించారు.

Full View  

Similar News