హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులు హల్చల్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపైనే ఎదురుదాడికి దిగారు కొందరు మందుబాబులు. మద్యం మత్తులో పోలీసులకే చుక్కలు చూపించారు. వీకెండ్ కావడంతో స్నేహితులుగా కసిలి ఫుల్లుగా మందేసి వాహనం నడుపుతూ నానా రచ్చవేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సహకరించకుండా పోలీసులనే పరుగులు పెట్టించారు. టెస్ట్‌కు ససేమిరా అనడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు తాగి వాహనం నడిపిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఒక లేడి కూడా ఉంది. మొత్తం 9 కార్లు 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మందుబాబులను రేపు బేగంపేట పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.