జనసేన పార్టీతో పొత్తుపై స్పందించిన సీపీఐ నేత నారాయణ!

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయా పార్టీలు ఊపందుకుంటున్నాయి. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతోనే కలిసి ముందుకు వెళ్తమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలకు సీపీఐ నేత నారారాయణ స్పందించారు.

Update: 2019-01-03 09:23 GMT

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయా పార్టీలు ఊపందుకుంటున్నాయి. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతోనే కలిసి ముందుకు వెళ్తమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలకు సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అప్పడే ఓటమి భయం వెంటాడుతుందని అందుకోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కోసమే పవన్‌ను ఆహ్వానిస్తున్నారని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. కాగా నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాన్‌నుపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పడు తన రూటు మార్చుకొని పవన్‌తో పొత్తుపెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీపీీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీ చేస్తాయని నారాయణ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, భారతప్రధాని నరేంద్రమోడీ దేశంలోని వ్యవస్థలను భ్రఘ్టపట్టించారని నారాయణ మండిపడ్డారు.

Similar News