అలీ పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి

నటుడు, కమెడీయన్ అలీ వైఎస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అలీ సై అన్నట్లు తెలిసింది.

Update: 2019-01-05 04:44 GMT
Comedian Ali

నటుడు, కమెడీయన్ అలీ వైఎస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అలీ సై అన్నట్లు తెలిసింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఊహించని విధంగా నేతలు పార్టీలు మారుతుండగా, సినీ నటులు పార్టీల్లో చేరుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కమెడీయన్ అలీ క్లోజ్. తన సినిమాల్లో తప్పనిసరిగా అలీ ఉండేవిధంగా పవన్ చూసుకున్నారు. వీరిద్దరూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. పవన్ తో ఉన్న సన్నిహితంతో అలీ జనసేనలో చేరుతాడనే ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లు అలీ జనసేనలో కాకుండా వైసీపీలో చేరుతున్నారు.

గత నెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ ను అలీ కలిశారు. తాను వైసీపీలో చేరనున్న విషయాన్ని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు.

మైనార్టీ వర్గానికి చెందిన అలీ ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే విషయంపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సొంత ఏరియా రాజమండ్రి లేదా ముస్లింలు అధికంగా ఉండే విజయవాడ వెస్ట్ లేదా గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీలో అలీ పాత్ర ఎలా ఉండబోతుందన్న అన్న దానిపై అందరీలో ఆసక్తి నెలకొంది.  

Similar News