సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటన షెడ్యూల్

Update: 2019-03-23 16:31 GMT

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లో లోక్ సభ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో పార్టీలో నేతల మధ్య సమన్వయం ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 11 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రచారం చేపట్టనున్న గులాబీ బాస్ 20 సభల్లో పాల్గొననున్నారు.

లోక్‌సభ అభ్యర్థుల జాబితా ప్రక్రియ ముగియడంతో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 28 నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 11 రోజుల పాటు 20 సభల్లో పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో గులాబీ బాస్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఉత్సాహంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలోని 16 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు వీలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రాష్ర్టంలోనిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.

ఈ నెల 28న సభ ఎక్కడ అనేది నిర్ణయించలేదు 29న నల్లగొండలో, 31న మహబూబ్ నగర్, ఏప్రిల్ 1న మహబూబాబాద్,ఖమ్మంలో సభలపై పార్టీ శ్రేణులకు సమాచారం పంపించారు. ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు కొనసాగనున్నాయి. మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో రెండు సభలు నిర్వహించాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 9 వరకు చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షోలను నిర్వహించనున్నారు.   

Similar News