పోలవరం ఏటీఎం కాదు.. ఏటీడబ్ల్యూ.. ఎనీ టైం వాటర్: చంద్రబాబు

Update: 2019-04-17 13:03 GMT

పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రతిపదికన జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. జులైలో పోలవరం నుంచి నీరు విడుదల అవుతుందని చెప్పారు. పోలవరం పనులపై 90వ సారి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. పోలవరం పనులు 69 శాతం పూర్తయ్యాయన్న చంద్రబాబు ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఇంకా 4 వేల 508 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. పోలవరాన్ని డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామనీ అందుకే కేంద్రం ఇబ్బందులు సృష్టించినా పట్టు వదల కుండా పని చేస్తున్నామని చెప్పారు. 45 రోజుల తర్వాత పోలవరంపై సమీక్ష చేశామని, మార్చి, ఏప్రిల్‌లో అంచనాలను చేరలేకపోయామని, కొన్ని అంశాల్లో కొంతమేర పనుల వేగం తగ్గిందని బాబు చెప్పుకొచ్చారు.పోలవరాన్ని డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాం. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. పోలవరం ఏటీఎం కాదు ఏటీడబ్ల్యూ ఎనీ టైం వాటర్ అని అన్నారు.

Similar News