టీడీపీలో తెగని సీట్ల పంచాయితీ ...మృణాళినికి సీటు ఇచ్చేందుకు...

Update: 2019-03-13 03:55 GMT

టీడీపీలో సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. ఇప్పటి వరకు 135 అసెంబ్లీ స్థానాలకు కొలిక్కి వచ్చింది. పెండింగ్ స్థానాలపై ఇవాళ చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. పాతపట్నం, పాలకొండ, విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురపల్లి, పార్వతీపురం, పాయకరావుపేట, భీమిలి, కొవ్వూరు , గుంటూరు ఈస్ట్, వెస్ట్, ప్రత్తిపాడు, నర్సరావుపేట, పొద్దుటూరుతో పాటు మరికొన్ని స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

విజయనగరంలో అధిష్టానానికి అశోక్ గజపతి వ్యవహారం తలనొప్పిగా మారింది. మృణాళినికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు. చీపురుపల్లి పరిశీలనలో త్రిమూర్తులు రాజు, ఎమ్మార్జీ నాయుడు ఉన్నారు. స్థానికంగా ఉండే ఎమ్మార్జీ నాయుడుకు సీటు ఇవ్వాలని మంత్రి గంటా కోరుతున్నారు. ఇప్పటి వరకు సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో మంత్రి గంటా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి సీట్లపై పీటముడి వీడటం లేదు. శిద్దా రాఘవరావు, ఎస్పీవై రెడ్డిలతో అధిష్టానం ఇవాళ మరోసారి చర్చలు జరుపనుంది. 

Similar News