ఏప్రిల్‌లో చంద్రయాన్-2 !

ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ కె శివన్ శుక్రవారం ప్రకటించారు.

Update: 2019-01-11 13:16 GMT

ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ కె శివన్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్ -2 ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి 16 మధ్య ఒక విండోలో ప్రారంభించనున్నట్లు ఇస్రో ముందుగా ప్రకటించింది. దాదాపు 800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకం గత పది సంవత్సరాల క్రితం చంద్రయాన్ -1 మిషన్‌కు అడ్వాన్స్‌డ్ వర్షెన్‌గా చంద్రయాన్-2ను డిజైన్ చేశారు. ప్రస్తుతం చంద్రయాన్ మార్చి 25 నుంచి ఏప్రిల్ చివరి వరకు ఎప్పుడైనా ఉండవచ్చని శివన్ తెలిపారు. అంతరిక్ష యాజమాన్యం ముందుగానే జనవరి మరియు ఫిబ్రవరి మధ్య అంతరిక్షనౌకను ప్రారంభించాలని ప్రణాళిక వేసినకానీ కొన్ని పరీక్షలను నిర్వహించలేకపోవటం వలన ప్రయోగం ఆగిపోయిందని అన్నారు. 

Similar News