టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్

టీడీపీ, జనసేన పొత్తు గురించి వ్యాఖ్యాలు చేసిన ఎంపీ . టీజీ వెంకటేష్ ‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

Update: 2019-01-23 09:45 GMT

టీడీపీ, జనసేన పొత్తు గురించి వ్యాఖ్యాలు చేసిన ఎంపీ . టీజీ వెంకటేష్ ‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అనవసరపు వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేయవద్దని ఆదేశించారు. టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ఈ ఉదయం టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. పార్టీ విధానాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సయమనం పాటించాలని ఆదేశించిన చంద్రబాబు ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో తీవ్ర గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

Similar News