ఆ రికార్డు బీజేపీదే!

Update: 2019-05-23 09:10 GMT

కేంద్రంలో అధికారాన్ని తిరిగి సాధించే దిశలో బీజేపీ దూసుకుపోతోంది. ఈ దూకుడులో రికార్డులు సృష్టిస్తోంది. ఇదే దూకుడు ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకూ కొనసాగితే 1980 నాటి ఓటింగ్ శాతం రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకూ మన దేశ ఎన్నికల్లో ఓ పార్టీకి 40 శాతం ఓట్లు రావడం మూడు సార్లే జరిగింది. 1977లో జనతా పార్టీ 41.3 శాతం ఓటింగ్ సాధించింది. ఇక 1980లో కాంగ్రెస్‌కు 42.7 శాతం ఓటింగ్ వచ్చింది. 1984లో కాంగ్రెస్‌ 48.1% ఓటింగ్‌ తో 404 సీట్లు గెలుచుకోవడం రికార్డు. ఇపుడు అంత వరకూ బీజేపీ సాధించే చాన్స్ లేదు కానీ.. 1980 రికార్డ్ ను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రికార్డు సృష్టించడం ఖాయమని భావించవచ్చు.  

Similar News