అయోధ్య కేసు జనవరి 10కి వాయిదా

అయోధ్య భూ వివాదం కేసు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జనవరి 10న తదుపరి విచారణ చేపట్టనుంది. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కుదారులెవరో తేలడానికి మరికొంత సమయం పట్టనుంది.

Update: 2019-01-04 06:47 GMT
Supreme Court

అయోధ్య భూ వివాదం కేసు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జనవరి 10న తదుపరి విచారణ చేపట్టనుంది. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కుదారులెవరో తేలడానికి మరికొంత సమయం పట్టనుంది. అయోధ్య భూ వివాదంపై దాఖలైన అప్పీళ్లను విచారించిన సీజే రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్కే కౌల్‌ ధర్మాసనం కేవలం 30 సెకన్లలోనే కేసును వాయిదా వేసింది.

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలని అలహాబాద్‌ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే, అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే, అయోధ్య భూవివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు అప్పీళ్లపై విచారణను జనవరి మొదటి వారంలో తగిన ధర్మాసనానికి నివేదిస్తామని గత విచారణలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తాజాగా విచారణను వాయిదా వేసింది. 

Similar News